ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ పోటీల్లో..

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీలలో వివిధ విభాగాల్లో ముగ్గురు ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లు ఆరు బహుమతులకు ఎంపికయ్యారు. ఆవుల శ్రీనివాస్‌ (హైదరాబాద్‌).. నగర, మౌలిక సదుపాయాలు,

Updated : 19 Aug 2022 05:22 IST

‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లకు ఆరు బహుమతులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీలలో వివిధ విభాగాల్లో ముగ్గురు ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లు ఆరు బహుమతులకు ఎంపికయ్యారు. ఆవుల శ్రీనివాస్‌ (హైదరాబాద్‌).. నగర, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి విభాగంలో ప్రథమ, స్కై లైన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ విభాగంలో ద్వితీయ, ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు. ఇంగు శ్రీనివాస్‌ (నిజామాబాద్‌) పల్లె-పట్టణ ప్రగతి విభాగంలో ప్రథమ, ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు. ఆవుల సంపత్‌కుమార్‌ (వరంగల్‌)కు బంగారు తెలంగాణ అంశంలో మహిళా విభాగంలో ప్రోత్సాహక బహుమతి ఇవ్వనున్నారు. మొత్తం 5 విభాగాల్లో ఒక్కో దానిలో 8 మంది చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహకాలకు 40 మంది ఫోటోగ్రాఫర్లు ఎంపికైనట్టు అధికారులు తెలిపారు.


ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీలలో వివిధ విభాగాల్లో ముగ్గురు ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లు ఆరు బహుమతులకు ఎంపికయ్యారు. బహుమతులు సాధించిన ఆ చిత్రాలివే..


ఆవుల శ్రీనివాస్‌ (హైదరాబాద్‌) ప్రథమ, ద్వితీయ, ప్రోత్సాహక బహుమతులకు ఎంపికైన చిత్రాలు..


ఇంగు శ్రీనివాస్‌ (నిజామాబాద్‌) ప్రథమ, ప్రోత్సాహక బహుమతులకు ఎంపికైన ఫొటోలివే.. 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని