రామోజీ ఫిల్మ్‌సిటీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం

త్వరలో ఐఆర్‌సీటీసీ ద్వారా కూడా రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన వివిధ టూర్‌ ప్యాకేజీల సమాచారం అందుబాటులోకి రానుంది. పర్యాటకులు ఈ వేదిక నుంచి కూడా ఆర్‌ఎఫ్‌సీ ప్యాకేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. థిమాటిక్‌ హాలిడే

Updated : 19 Aug 2022 06:38 IST

 త్వరలో ఆర్‌ఎఫ్‌సీ ప్యాకేజీలను ఈ వేదిక నుంచి కూడా ఎంచుకోవడానికి పర్యాటకులకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: త్వరలో ఐఆర్‌సీటీసీ ద్వారా కూడా రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన వివిధ టూర్‌ ప్యాకేజీల సమాచారం అందుబాటులోకి రానుంది. పర్యాటకులు ఈ వేదిక నుంచి కూడా ఆర్‌ఎఫ్‌సీ ప్యాకేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. థిమాటిక్‌ హాలిడే డెస్టినేషన్‌గా పేరొందిన రామోజీ ఫిల్మ్‌సిటీ... దేశవ్యాప్తంగా పలు రకాల పర్యాటక సేవలందించే భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఆర్‌ఎఫ్‌సీలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి, ఐఆర్‌సీటీసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ డి.నరసింగరావు ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు.

గౌరవంగా భావిస్తున్నాం...

ఇలా ఒప్పందం కుదరడం గౌరవంగా భావిస్తున్నామని నరసింగరావు అన్నారు. ‘‘దీని ద్వారా సామాన్యులకు పర్యాటక రంగాన్ని చేరువ చేయవచ్చు. అందుకు తగ్గ కృషి జరుగుతుంది. రెండు సంస్థల వెబ్‌సైట్ల ద్వారా త్వరలో వివిధ రకాల ప్యాకేజీలను ప్రజలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది’’ అని వివరించారు. కార్యక్రమంలో ఐఆర్‌సీటీసీ అధికారులతో పాటు ఫిల్మ్‌సిటీ టూరిజం విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ కె.వెంకటరత్నం, పబ్లిసిటీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ.వి.రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని