విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు ఆరంభం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. తనిఖీలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ఎలాంటి ఆటంకాలు, వేచి ఉండే అవసరం లేకుండా

Published : 19 Aug 2022 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. తనిఖీలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ఎలాంటి ఆటంకాలు, వేచి ఉండే అవసరం లేకుండా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికత సాయంతో విమానాశ్రయంలో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకునే సదుపాయంలో భాగంగా కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది. గురువారం ఈ సాంకేతికతను ఎయిర్‌పోర్టు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రదీప్‌ఫణీకర్‌ అధికారికంగా ప్రారంభించారు. డిజియాత్ర యాప్‌ సాయంతో ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇ-గేట్‌ను కేటాయించారు. అనంతరం ఓ ప్రయాణికుడు యాప్‌ సేవలతో ముఖ గుర్తింపు సాంకేతికతతో విమానాశ్రయంలోకి వెళ్లాడు. దేశంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చిన ఐదు విమానాశ్రయాల్లో హైదరాబాద్‌ ఒకటి కావడం విశేషం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని