గ్రేహౌండ్స్‌కు ఆధునిక కవచాలు

తెలంగాణ గ్రేహౌండ్స్‌ పేరు చెబితే చాలు వామపక్ష తీవ్రవాదాన్ని అణచడంలో దిట్ట అని దేశవ్యాప్తంగా అన్ని పోలీసు శాఖలు చెబుతాయి. అలాంటి గ్రేహౌండ్స్‌ను మరింత పటిష్ఠ పరిచేలా ఆధునిక కవచాలు రాబోతున్నాయి. జంగిల్‌

Published : 19 Aug 2022 05:08 IST

ఏకే-47, ఇన్సాస్‌ రైఫిల్‌ కాల్పులను తట్టుకునే అధునాతన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు

నైట్‌విజన్‌ బైనాక్యులర్స్‌ గల శిరస్త్రాణాలు 

రూ.50 కోట్లతో కొనుగోలుకు పోలీస్‌శాఖ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గ్రేహౌండ్స్‌ పేరు చెబితే చాలు వామపక్ష తీవ్రవాదాన్ని అణచడంలో దిట్ట అని దేశవ్యాప్తంగా అన్ని పోలీసు శాఖలు చెబుతాయి. అలాంటి గ్రేహౌండ్స్‌ను మరింత పటిష్ఠ పరిచేలా ఆధునిక కవచాలు రాబోతున్నాయి. జంగిల్‌ వార్‌ఫేర్‌లో పోలీసులకు రక్షణ అందించడంలో కీలకంగా వ్యవహరించే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లతోపాటు శిరస్త్రాణాల(హెల్మెట్ల)ను సమకూర్చుకునేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. రూ. 50 కోట్లతో 50 జాకెట్లు, 50 హెల్మెట్లను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పెద్దగా లేకపోయినా సరిహద్దుల్లో తరచూ గ్రేహౌండ్స్‌ సభ్యులు కూంబింగ్‌ నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆధునిక పరికరాలను సమకూర్చుకోవడంపై తెలంగాణ పోలీస్‌శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తాజాగా టెండర్లు పిలిచింది. బిడ్డింగ్‌లో అర్హత సాధించే కంపెనీలు సమకూర్చే అస్త్రాల సామర్థ్యాన్ని ఛండీగడ్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌, టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ప్రయోగశాలల్లో లేదా గాంధీనగర్‌లోని గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనిట్‌లో పరీక్షించి కొనుగోలు చేయనున్నారు.

బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ప్రత్యేకతలు..

* ఏకే-47 లేదా ఇన్సాస్‌ రైఫిల్‌తో 10 మీటర్ల దూరం నుంచి కాల్చినా తట్టుకునేలా ఉంటుంది.

* అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ప్రమాణాల ప్రకారం 0101.06 స్టాండర్డ్స్‌తో కూడిన లెవల్‌ 3ఏ సామర్థ్యంతో ఉంటుంది.

* 0 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకునేలా, 40 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 95 శాతం తేమను తట్టుకునేలా ఉండనుంది.

* రెండు ఏకే-47 మేగజైన్లు పెట్టుకునే సదుపాయం జాకెట్‌కు ఉంటుంది. అలాగే రెండు హెచ్‌ఈ-36 రకం గ్రెనేడ్లతోపాటు మ్యాన్‌ప్యాక్‌ అమర్చుకోవచ్చు.

* ఒక్కో జాకెట్‌ 7 కిలోల బరువుండనుంది. పెద్దవి 7.5-8 కిలోలుంటాయి.

  హెల్మెట్‌ ఇలా..

* బరువు 1.7 కేజీలకు తక్కువ కాకుండా ఉంటుంది.

* నైట్‌విజన్‌తో కూడిన బైనాక్యులర్‌ అదనపు సౌకర్యం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని