ఒకట్రెండు రోజుల్లో కరెంటుకు ఇబ్బందులు

రానున్న ఒకటి రెండు రోజుల్లో కరెంటు సరఫరాకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా నోటీసు ఇవ్వకుండా

Published : 20 Aug 2022 03:13 IST

ట్రాన్స్‌కో సీఎండీ

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న ఒకటి రెండు రోజుల్లో కరెంటు సరఫరాకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎక్స్ఛేంజీ నుంచి కరెంటు కొనకుండా ఆదేశాలిచ్చిందని ఆయన తెలిపారు. ‘పాత బకాయిలు రూ.1360 కోట్లు చెల్లించినా, కరెంటు కొనకుండా ఆపడం బాధాకరం. దీనిపై శుక్రవారం సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం సూచించారు. జలవిద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. కొరత రాకుండా చూస్తున్నాం. శుక్రవారం రాష్ట్రంలో 12,214 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా.. కోతలు విధించలేదు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు సరఫరాలో అంతరాయం ఏర్పడినా రైతులు, ప్రజలు సహకరించాలి’ అని ప్రభాకర్‌రావు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని