Telangana News: పండగవేళ.. కొలువుల కళ

నిరుద్యోగులు ఎదురుచూస్తున్న కొలువుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. వినాయక చవితి పర్వదినానికి ఒక్కరోజు ముందు వారికి తీపి కబురు చెప్పింది. గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలతో పాటు పలుశాఖల్లో ఖాళీగా ఉన్న వాటితో కలిపి మొత్తం 2,910 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర

Published : 01 Sep 2022 02:55 IST

వివిధ శాఖల్లో 2,910 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా

వీటితో కలిపి ఇప్పటివరకు అనుమతించినవి 52,460

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌

నిరుద్యోగులు ఎదురుచూస్తున్న కొలువుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. వినాయక చవితి పర్వదినానికి ఒక్కరోజు ముందు వారికి తీపి కబురు చెప్పింది. గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలతో పాటు పలుశాఖల్లో ఖాళీగా ఉన్న వాటితో కలిపి మొత్తం 2,910 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నేరుగా భర్తీచేసే విధానంలో వీటికి నోటిఫికేషన్‌ జారీచేయాలని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)ను ఆదేశించింది. శాఖల వారీగా ఏయే పోస్టులు, ఎన్ని భర్తీచేయాలనే వివరాలను వేర్వేరు ఉత్తర్వులలో ప్రకటించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్ల వారీగా సంబంధిత పోస్టుల వివరాలను కమిషన్‌కు పంపాలంటూ ఆయా శాఖల అధిపతులను ఆదేశించింది. గతంలో జారీచేసిన ఉద్యోగ ప్రకటనలతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 52,460 పోస్టులకు అనుమతించినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా ట్విటర్‌లో తెలిపారు. ‘సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలులో భాగంగానే మంగళవారం 2,910 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీచేశాం. దీంతో 50 వేల ఉద్యోగాల మైలురాయిని రాష్ట్రం అధిగమించింది’’ అని స్పష్టం చేశారు. గ్రూప్‌-2, గ్రూప్‌- 3కి సంబంధించి ఏ శాఖలో ఎన్ని పోస్టుల భర్తీకి అనుమతించారనే వివరాలను అందులో ఆయన తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు జారీచేస్తామని తెలిపారు.

1654 అతిథి అధ్యాపకుల నియామకం

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతినిస్తూ ఆర్థికశాఖ మంగళవారం జీవో జారీ చేసింది. వాస్తవానికి వీరంతా కళాశాలల ప్రారంభం నుంచే విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు అవి వచ్చాయి.


వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని