44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు

తెలుగు సాహిత్యానికి సంబంధించి వివిధ ప్రక్రియల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 44 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ

Updated : 03 Sep 2022 05:21 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యానికి సంబంధించి వివిధ ప్రక్రియల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 44 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురిని పురస్కార గ్రహీతలుగా శుక్రవారం ఎంపిక చేసింది. వీరికి త్వరలోనే వర్సిటీలో జరిగే కార్యక్రమంలో రూ.5,116 నగదుతోపాటు పురస్కార పత్రాలను అందజేసి సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ తెలిపారు. కీర్తి పురస్కారాలకు ఎంపికైన వారిలో.. ‘పి.వి.మనోహరరావు (ఆధ్యాత్మిక సాహిత్యం), బాలాంత్రపు వెంకటరమణ (ప్రాచీన సాహిత్యం), గన్ను కృష్ణమూర్తి (సృజనాత్మక సాహిత్యం), రామగిరి శివకుమార్‌ (కాల్పనిక సాహిత్యం), వి.రమాంజనీ కుమారి (అనువాద సాహిత్యం), గరిపల్లి అశోక్‌ (బాల సాహిత్యం), కవిరాజు (వచన కవిత), బి.రాములు (తెలుగు గేయం), డా.నలవోలు నరసింహారెడ్డి (పద్య రచన), డా.వజ్జల రంగాచార్య (పద్య రచన), కూతురు రాంరెడ్డి (కథ), పి.ఎస్‌.నారాయణ (నవల), వై.వి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి (హాస్యరచన), గిడుగు వెంకట రామకృష్ణారావు (జీవిత చరిత్ర), మల్లవరపు చిన్నయ్య (వివిధ ప్రక్రియలు), వడ్డేపల్లి నర్సింగరావు (నాటక రచయిత), దోర్బల బాలశేఖరశర్మ (జనరంజక విజ్ఞానం), సంకేపల్లి నాగేంద్రశర్మ (పరిశోధన), పొన్నం రవిచంద్ర (పత్రికారచన), పారుపల్లి కోదండరామయ్య (భాష), ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ (సాహిత్య విమర్శ), చుక్కాయపల్లి శ్రీదేవి (అవధానం), విజయలక్ష్మీశర్మ (లలిత సంగీతం), దారూరి సులోచనాదేవి (శాస్త్రీయ సంగీతం), అంతడ్పుల రమాదేవి (జానపద గాయకురాలు), జగ్లర్‌ నారాయణ (జానపద కళలు), డా.సావిత్రిసాయి (ఉత్తమ రచయిత్రి), ఝాన్సీ కె.వి.కుమారి (ఉత్తమ రచయిత్రి), బి.హైమావతి (ఉత్తమ నటి), వి.నారాయణ (ఉత్తమ నటుడు), ముట్నూరు కామేశ్వరరావు (నాటకరంగం), డా.బి.కుమారస్వామి (ఆంధ్రనాట్యం), డా.పసుమర్తి శేషుబాబు (కూచిపూడి నృత్యం), డా.సి.వీరేందర్‌ (వ్యక్తిత్వవికాసం), నార్నె వెంకట సుబ్బయ్య (హేతువాద ప్రచారం), ప్రొ.రమా మెల్కోటే (మహిళాభ్యుదయం), ఎ.పుల్లయ్య (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ఎం.సైదానాయక్‌ (గ్రంథాలయకర్త), రఘుశ్రీ (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), వేములపాటి మాధవరావు (ఇంద్రజాలం), నర్సిం (కార్టూనిస్టు), డా.రథం మదనాచార్యులు (జ్యోతిషం), డా.రాజ్‌ మహ్మద్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొ.గీతా కృష్ణమాచారి (చిత్రలేఖనం)లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని