మూడోరోజు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మూడోరోజూ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Published : 19 Sep 2022 03:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మూడోరోజూ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హాజరై స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. కామారెడ్డిలో నిర్వహించిన వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ తదితర మంత్రులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వద్ద ప్రముఖ డ్రమ్స్‌ కళాకారుడు శివమణి ప్రదర్శన ఆకట్టుకుంది. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే సీతక్క తదితరులు హాజరయ్యారు. శివమణి వాద్యానికి మంత్రి సత్యవతి కాసేపు సరదాగా నృత్యం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని