31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు

రెవెన్యూశాఖలో 31మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికీ వీరిలో చాలా మంది జిల్లా రెవెన్యూ

Published : 24 Sep 2022 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూశాఖలో 31మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికీ వీరిలో చాలా మంది జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్‌డీ మాధురి, బి.రోహిత్‌ సింగ్‌, ఎ.పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్‌, మహ్మద్‌ అసదుల్లా తదితరులు పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే వారు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించడం సంతోషమని, ఖాళీ స్థానాల్లో తహసీల్దార్లకు కూడా డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్‌ శుక్రవారం తెలిపారు. సీఎం కేసీఆర్‌, సీఎస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని