శాఖాపరమైన పదోన్నతులకు జాబితాలు ఇవ్వండి

తెలంగాణలో శాఖాపరమైన పదోన్నతుల కోసం అర్హులైన అధికారుల జాబితాలను రూపొందించి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు శుక్రవారం

Published : 24 Sep 2022 05:12 IST

అన్ని శాఖలకు సీఎస్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో శాఖాపరమైన పదోన్నతుల కోసం అర్హులైన అధికారుల జాబితాలను రూపొందించి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ)లకు కొత్త ప్యానెల్‌ (2022-23) సంవత్సరం ఈ నెల మొదటి తేదీ నుంచే వచ్చే ఏడాది (2023) ఆగస్టు 31 వరకు ఉంటుందని, ఈ కాలానికి పదోన్నతుల కమిటీ పంపే జాబితాల రూపకల్పనపై మార్గదర్శకాలను ఆయన నిర్దేశించారు. పదోన్నతులు పొందాల్సిన అధికారుల సమాచారాన్ని పక్కాగా ఇవ్వాలని.. సీనియారిటీ, వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌), సస్పెన్షన్లు, అభియోగాలు, క్రమశిక్షణ చర్యలుంటే వాటి వివరాలు, శాఖలో ఖాళీల వివరాలు, రోస్టర్‌, పదవీ విరమణ తేదీ, తదితర సమాచారంతో సీల్డ్‌ కవర్లలో ఆరు సెట్ల పత్రాలను సమర్పించాలని సూచించారు. డీపీసీ సమాచారం వెల్లడించిన వెంటనే నివేదికలు పంపాలని, కొన్ని శాఖలు చివరి వారం, రోజు, నిమిషంలో దస్త్రాలను పంపుతున్నాయని, వాటిని ఇకపై పరిగణనలోనికి తీసుకోబోమన్నారు. డీపీసీ ఛైర్మన్‌, సభ్యులు మాత్రమే సమావేశాల్లో పాల్గొనాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని