ఆలోచన భళా.. అక్రమ పార్కింగుకు అడ్డుకట్ట ఇలా..

ఈ హరితహార విభాగిని హైదరాబాద్‌ మధురానగర్‌ కాలనీలోనిది. కాలనీ ప్రధాన రహదారి మధ్యలోంచి వెళ్తున్న ఆరడుగుల ఓపెన్‌ నాలాపై కాంక్రీటు స్లాబ్‌ వేసిన మున్సిపల్‌ అధికారులు

Published : 24 Sep 2022 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈ హరితహార విభాగిని హైదరాబాద్‌ మధురానగర్‌ కాలనీలోనిది. కాలనీ ప్రధాన రహదారి మధ్యలోంచి వెళ్తున్న ఆరడుగుల ఓపెన్‌ నాలాపై కాంక్రీటు స్లాబ్‌ వేసిన మున్సిపల్‌ అధికారులు దానిపై బరువైన విభాగిని నిర్మించటం ప్రమాదకరమని అలాగే వదిలేశారు. దీంతో ఖాళీ రోడ్డు కార్ల అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. ఈ క్రమంలో మధురానగర్‌ వెల్ఫేర్‌ కమిటీవారు గాల్వనైజ్‌డ్‌ సీ ఛానల్‌ స్టీల్‌ ఉపయోగించి ఇనుప విభాగిని నిర్మాణం చేశారు. మధ్యలో ఏర్పాటుచేసిన కుండీల్లో ఇలా మొక్కలు నాటి అక్రమ పార్కింగ్‌ను అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని