మీటర్‌ రీడింగ్‌ నమోదుకు ఆటోమేటిక్‌ వ్యవస్థలు రావాలి: సీఎండీ

కరెంటు మీటర్‌ రీడింగ్‌ నమోదుకు ఆటోమేటిక్‌ వ్యవస్థలు రావల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు. శుక్రవారం

Published : 24 Sep 2022 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరెంటు మీటర్‌ రీడింగ్‌ నమోదుకు ఆటోమేటిక్‌ వ్యవస్థలు రావల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో ఆయన అధ్యక్షతన దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ ఇంధన కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎండీ మాట్లాడారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థంగా, పూర్తిస్థాయిలో వాడుకోవాలని, దీని వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థికభారం పడకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని