అంతుచిక్కని వ్యాధితో ఆదివాసీల భయాందోళన

అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ఆదివాసీల వరుస మరణాలు సంభవిస్తుండడంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భారీ వర్షాలతో బీజాపూర్‌,

Published : 25 Sep 2022 04:05 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ఆదివాసీల వరుస మరణాలు సంభవిస్తుండడంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భారీ వర్షాలతో బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల్లోని ఆదివాసీ పల్లెల్లో రోగాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు నెలల వ్యవధిలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఇంతమంది మృతి చెందడంతో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. బీజాపూర్‌ జిల్లాలోని ఇంద్రావతి నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన 7 గ్రామాల్లో సుమారు 1,200 మంది ఆదివాసీలు అంతు చిక్కని వ్యాధితో బాధ పడుతున్నారు. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా 50 మంది తీవ్రంగా బాధ పడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని