30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) నిర్ణయించింది. శనివారం నిర్వహించిన న్యాక్‌ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి

Published : 25 Sep 2022 04:05 IST

న్యాక్‌ సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) నిర్ణయించింది. శనివారం నిర్వహించిన న్యాక్‌ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు న్యాక్‌ తెలిపింది. రాష్ట్రం నుంచి మధ్యప్రాచ్య దేశాలకు పెద్దసంఖ్యలో నిరుద్యోగులు వలస వెళ్తున్న నేపథ్యంలో 9 జిల్లాల్లో దశలవారీగా శిక్షణ కేంద్రాలను నిర్మిస్తారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే నియామకాల్లో ఎంపికైన ఇంజినీర్లకు 30 రోజులపాటు వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. దళితబంధు పథకం ద్వారా జేసీబీలు పొందినవారికి వాటి నిర్వహణపై శిక్షణ ఇస్తారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యాక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెండు దఫాలుగా వేతనాన్ని 30 శాతం పెంచుతారు. 2021 జనవరి నుంచి 20 శాతం, ఈ ఏడాది ఆగస్టు నుంచి 10 శాతం వేతనం పెంపును సమావేశం ఆమోదించింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని