ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు అనుమతివ్వండి

ఆంధ్రప్రదేశ్‌లోని 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు వీలుగా అంతర్రాష్ట బదిలీలకు అనుమతి(కాన్సెంట్‌) ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను

Published : 25 Sep 2022 04:05 IST

తెలంగాణ సీఎస్‌కు ఏపీ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు వీలుగా అంతర్రాష్ట బదిలీలకు అనుమతి(కాన్సెంట్‌) ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లేఖ రాశారు. తెలంగాణ నుంచి 1,369 మంది ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు అనుమతించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని తెలిపారు. ఇదే తరహాలో ఏపీలోని 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు తాజాగా దరఖాస్తు చేసుకున్నారని, వారికి తమ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ జాబితాను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. వైద్యపరమైన కారణాలకు తోడు భార్య/భర్త తెలంగాణలో ఉద్యోగులుగా ఉండడం, పిల్లల చదువులు, సొంత ఇల్లు ఉండడం, ఇతరత్రా కారణాలతో దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఏపీ నుంచి 1,808 మంది, తెలంగాణ నుంచి 1,369 మంది కోరుతున్నందున అంతర్రాష్ట బదిలీల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వెంటనే అనుమతి ఇవ్వాలని సమీర్‌శర్మ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని