మింట్‌ మ్యూజియాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం

మింట్‌ మ్యూజియాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మింట్‌కాంపౌండ్‌లోని మ్యూజియాన్ని సందర్శించిన ఆయన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వెండి

Published : 25 Sep 2022 04:47 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మింట్‌ మ్యూజియాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మింట్‌కాంపౌండ్‌లోని మ్యూజియాన్ని సందర్శించిన ఆయన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వెండి నాణేలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 119 ఏళ్ల క్రితం మింట్‌ ప్రారంభమైందని, ఇక్కడ స్టాంపులు, మెడల్స్‌, అనేక రకాల నాణేలు  ముద్రించేవారన్నారు. ఈ తరహా మ్యూజియం దేశంలో మరెక్కడా లేదని.. పురాతన శ్రీరాముడి చిత్రపటం, నిజాం పటాలు ఎన్నో ఉన్నాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నగరవాసులు మ్యూజియాన్ని సందర్శించాలని, అవసరమైన మార్పులు చేసేందుకు సూచనలివ్వాలన్నారు. యాదాద్రి ఆలయానికి ఎంతో చరిత్ర, ప్రాధాన్యం ఉందని, స్వామి వారి నాణేన్ని అద్భుతంగా రూపొందించారని కొనియాడారు. నూతనంగా విడుదల చేసిన నాణెం యాదాద్రిలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మింట్‌ అధికారులు శివరామకృష్ణ, జేపీ దాస్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts