లోసంగిలో అరుదైన ‘మౌస్‌ డీర్‌’

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గిరిజన గ్రామంలో మౌస్‌డీర్‌ పిల్లను నర్సీపట్నం అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో కొందరు పిల్లలు దీంతో ఆడుకోవడం గమనించిన స్థానిక యువకుడు

Published : 25 Sep 2022 04:47 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గిరిజన గ్రామంలో మౌస్‌డీర్‌ పిల్లను నర్సీపట్నం అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో కొందరు పిల్లలు దీంతో ఆడుకోవడం గమనించిన స్థానిక యువకుడు జానకిరామ్‌ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎఫ్‌ఓ సూర్యనారాయణ, రేంజ్‌ అధికారి లక్ష్మీనరసు సిబ్బందితో గ్రామానికి చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసున్న ఈ మౌస్‌డీర్‌ అరుదైనదని డీఎఫ్‌ఓ తెలిపారు. దీన్ని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు అప్పగిస్తామన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని