కాలుష్య రహిత ట్రక్కులదే భవిష్యత్తు

దేశంలో వచ్చే 30 ఏళ్లలో సరకు రవాణా డిమాండ్‌ నాలుగింతలు కానున్నట్లు అంచనాల నేపథ్యంలో వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఉద్గార రహిత (పొగ తదితర కాలుష్య కారక వ్యర్థాలు బయటికి రాని)

Updated : 25 Sep 2022 05:58 IST

దేశంలో ట్రక్కుల రూపాంతరంపై నీతి ఆయోగ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో వచ్చే 30 ఏళ్లలో సరకు రవాణా డిమాండ్‌ నాలుగింతలు కానున్నట్లు అంచనాల నేపథ్యంలో వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఉద్గార రహిత (పొగ తదితర కాలుష్య కారక వ్యర్థాలు బయటికి రాని) వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నీతిఆయోగ్‌ ప్రతిపాదించింది. పట్టణీకరణ..పెరుగుతున్న జనాభాతో దేశంలో సరకు రవాణా డిమాండ్‌ 2050 నాటికి నాలుగింతలై..ట్రక్కుల సంఖ్య 1.7 కోట్లకు చేరుతుంది. ప్రస్తుత సంప్రదాయ డీజిల్‌ ట్రక్కులనే వినియోగిస్తే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరగడంతో పాటు కాలుష్యం భారీగా వెలువడనుంది. పెరుగుతున్న డీజిల్‌ ధరలతో రవాణా ఖర్చులు మరింత భారమవుతాయి. ఈ నేపథ్యంలో ఉద్గార రహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నీతిఆయోగ్‌ ప్రతిపాదించింది. 2050 నాటికి 90 శాతం ఉద్గార రహిత ట్రక్కులు ఉండేలా, భవిష్యత్తు అవసరాలు తీర్చేలా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించింది. ఈ మేరకు ‘దేశంలో ట్రక్కుల రూపాంతరం-ఉద్గార రహిత ట్రక్కులకు మార్గాలు’ పేరిట నివేదిక సిద్ధం చేసింది. ‘ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం ఉత్పత్తుల్లో 25 శాతం రోడ్డు మార్గాన సరకురవాణాకే ఖర్చవుతోంది. రానున్న 30 ఏళ్లలో మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్గార రహిత ట్రక్కులతో 838 బిలియన్‌ లీటర్ల డీజిల్‌ వినియోగాన్ని తగ్గించడంతోపాటు 2050 నాటికి రూ.116 లక్షల కోట్ల ఖర్చు తగ్గించవచ్చు’ అని నీతి ఆయోగ్‌ నివేదికలో వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని