చదువుల తల్లి సాయం కోరుతోంది!

ఆమెకు పుట్టుకతోనే వైకల్యం.. పేద కుటుంబం.. అయినా కష్టపడి చదివింది. జేఈఈ మెయిన్స్‌లో 340 జాతీయస్థాయి ర్యాంకు సాధించింది. కర్ణాటకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో దివ్యాంగుల

Published : 26 Sep 2022 03:48 IST

ఆమెకు పుట్టుకతోనే వైకల్యం.. పేద కుటుంబం.. అయినా కష్టపడి చదివింది. జేఈఈ మెయిన్స్‌లో 340 జాతీయస్థాయి ర్యాంకు సాధించింది. కర్ణాటకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో దివ్యాంగుల కోటా కింద బి.టెక్‌ సీటు లభించింది. కళాశాలలో చేరడానికి ఆమెకు ఆర్థిక పరిస్థితి అవరోధంగా మారింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన మోముల మహిపాల్‌, మంజుల దంపతుల కుమార్తె చైతన్య. ఆమెకు పుట్టుకతోనే ఎడమ పాదం లేకపోవడంతో కృత్రిమ కాలుతో నడుస్తోంది. తండ్రి మహిపాల్‌ అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆర్థికస్తోమత లేక శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితి. తల్లి మంజుల కుట్టుపనితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. చైతన్య నిట్‌లో బి.టెక్‌ చదవడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. అక్కడ ఫీజు ఏటా రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ కుటుంబం దాతల సహాయం కోరుతోంది. చైతన్య సోదరి వైష్ణవి పదో తరగతి చదువుతోంది.

-ఈనాడు, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని