KTR: మా బాబును కాపాడిన దేవుడు మీరే.. కేటీఆర్‌కు ఓ తండ్రి కృతజ్ఞతలు

అగ్నిప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్యనున్న తమ కుమారుడు కార్తీక్‌ను కాపాడారని, సత్వర చికిత్స ఇప్పించడంతో పాటు వైద్యానికి అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి

Updated : 26 Sep 2022 07:43 IST

తృప్తినిచ్చే సందేశమిది అన్న మంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: అగ్నిప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్యనున్న తమ కుమారుడు కార్తీక్‌ను కాపాడారని, సత్వర చికిత్స ఇప్పించడంతో పాటు వైద్యానికి అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించారని చిట్యాలకు చెందిన అశోక్‌ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుకు ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘ థాంక్యూ రామన్న! దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ.. మీరు మాకు ఉన్నారని ఒక ధైర్యం’’ అని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. ‘‘ప్రజాజీవితంలో అన్నిటికన్నా తృప్తినిచ్చే సందర్భాలలో ఇలాంటి సందేశం ఒకటి గుండెబోయిన అశోక్‌ అనే సోదరుడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం నుంచి పంపారు’’ అని ఆయన ట్విటర్‌లో తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని