చెక్కతో చక్కని గూళ్లు

నిర్మల్‌లోని అటవీశాఖ కార్యాలయానికి వెళ్తే చెట్లకు, కార్యాలయ ఆవరణలోనూ చెక్కతో రూపమిచ్చిన చక్కని పిట్టగూళ్లు కనిపిస్తాయి. అక్కడి అధికారులే వాటిని ఇష్టంగా రూపొందించి పక్షులు నివాసం ఉండేలా

Published : 26 Sep 2022 04:10 IST

నిర్మల్‌లోని అటవీశాఖ కార్యాలయానికి వెళ్తే చెట్లకు, కార్యాలయ ఆవరణలోనూ చెక్కతో రూపమిచ్చిన చక్కని పిట్టగూళ్లు కనిపిస్తాయి. అక్కడి అధికారులే వాటిని ఇష్టంగా రూపొందించి పక్షులు నివాసం ఉండేలా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినపుడు, తీవ్రమైన ఎండల సమయంలో పక్షులు వచ్చి వాటిలో తలదాచుకుంటాయని అక్కడి సిబ్బంది  చెబుతున్నారు. ఈ గూళ్లు ఇళ్లను పోలినట్లుగా తయారుచేయించడం విశేషం.

- న్యూస్‌టుడే, నిర్మల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని