తెలంగాణ ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల(చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబరు 26) సందర్భంగా

Updated : 26 Sep 2022 04:53 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల(చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబరు 26) సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పాయని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఆమె జీవితమే నిదర్శనమన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తోందని తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని