నేటి నుంచి యాదాద్రిలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి

Published : 26 Sep 2022 04:10 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. సోమవారం ఉదయం గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, రుత్విక్‌ వర్ణం, ప్రాతఃకాల పూజ, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిపి కలశ స్థాపన నిర్వహిస్తారు. సాయంత్రం వేళ దేవీ నవరాత్రి పూజ చేపట్టి, సప్తశతీ పారాయణం, త్రిశతీ ఖడ్గమాల అష్టోత్తర శతనామార్చన నిర్వహించనున్నట్లు శివాలయం ప్రధాన పూజారి తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తామని అన్నారు. దేవీ పూజలో పాల్గొనదలిచిన దంపతులు రూ.1,116.., ఒకరోజు సప్తశతీ పారాయణానికి రూ.116 చెల్లించాలని ఈవో గీత తెలిపారు.

దుర్గగుడిలో నేటి నుంచి దసరా వేడుకలు
ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 5 వరకు వేడుకలు కొనసాగుతాయి. ప్రస్తుతం కొవిడ్‌ నింబంధనలు అమలులో లేనందున పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి 3 కిలోమీటర్ల దూరం క్యూలైన్లను వేశారు. భక్తులు క్యూలైన్లలో ఒకసారి ప్రవేశిస్తే నేరుగా అమ్మవారిని దర్శించుకుని కిందకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని