హైదరాబాద్‌లో 346.. తిరుపతిలో 1313

ఐఐటీ హైదరాబాద్‌లో ఈసారి నాలుగేళ్ల బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సులో ఓపెన్‌ జెండర్‌ న్యూట్రల్‌ కేటగిరీలో ప్రారంభ ర్యాంకు 346. ఏపీలోని తిరుపతి

Published : 26 Sep 2022 04:10 IST

ఐఐటీల్లో బీటెక్‌ సీఎస్‌ఈలో ప్రారంభ ర్యాంకులివీ...

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీ హైదరాబాద్‌లో ఈసారి నాలుగేళ్ల బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సులో ఓపెన్‌ జెండర్‌ న్యూట్రల్‌ కేటగిరీలో ప్రారంభ ర్యాంకు 346. ఏపీలోని తిరుపతి ఐఐటీలో 1313  ప్రారంభ ర్యాంకు. వీటికి అన్ని కేటగిరీల బాలురు, బాలికలు పోటీపడొచ్చు. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో 60 సీట్లకుగాను ఓపెన్‌ న్యూట్రల్‌లో 18, తిరుపతిలో 53 సీట్లకు 17 ఓపెన్‌ న్యూట్రల్‌ సీట్లు ఉన్నాయి. గతేడాది ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో తొలి విడత సీట్ల కేటాయింపులో ప్రారంభ, ముగింపు ర్యాంకులు 191, 520. చివరి విడతకు అది 191, 521కి మారింది. ఈసారి తొలి విడతలో ప్రారంభ ర్యాంకు 346 ఉండటం గమనార్హం. దీని ప్రకారం.. ఐఐటీ హైదరాబాద్‌లో చేరే ఉత్తమ ర్యాంకర్లు కొంత తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. చివరి విడత కౌన్సెలింగ్‌ నాటికి మరికొంత మార్పు వస్తుందని అంచనా. ఐఐటీ తిరుపతిలో గతేడాది చివరి విడతలో ప్రారంభ, ముగింపు ర్యాంకులు 1682, 3441. ఈ సారి మొదటి విడతలో 1313, 3746 ప్రారంభ, ముగింపు ర్యాంకులు. తిరుపతి ఐఐటీలో ప్రవేశంపొందే ఉత్తమ ర్యాంకర్లు కొంత పెరుగుతున్నారని తెలుస్తోంది. అక్కడ సొంత ప్రాంగణం సమకూరడం, ఆచార్యుల భర్తీ పూర్తికావడంతో పరిస్థితిలో మార్పు వస్తోందని భావిస్తున్నారు. తొలి విడత ప్రవేశాల్లో ఐఐటీ హైదరాబాద్‌లో 500లోపు ర్యాంకు సాధించిన తొమ్మిది మంది, వెయ్యిలోపు ర్యాంకర్లు 33 మంది విద్యార్థులు చేరారని డైరెక్టర్‌ బి.ఎస్‌.మూర్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని