అక్టోబరు 22న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహావిష్కరణ

భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబరు 22న ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓంబుష్‌ పార్క్‌లో ప్రతిష్ఠించనున్నట్లు తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌

Published : 26 Sep 2022 04:10 IST

తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబరు 22న ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓంబుష్‌ పార్క్‌లో ప్రతిష్ఠించనున్నట్లు తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల తెలిపారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ పీవీ జయంత్యుత్సవాల కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, పీవీ కుటుంబ సభ్యులు, మిగతా ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో కేశవరావును కలిసి విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణ ఏర్పాట్లకు సంబంధించి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విగ్రహావిష్కరణకు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస భారత, తెలుగు, తెలంగాణ సంఘాలను ఆహ్వానిస్తామని చెప్పారు. భారత్‌ బయట ఏర్పాటు చేస్తున్న పీవీ మొదటి విగ్రహం ఇదేనన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts