అమల్లోకి 13 కొత్త మండలాలు

రాష్ట్రంలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. నెల రోజుల క్రితం వీటిపై నోటిఫికేషన్‌ వెలువరించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.

Published : 27 Sep 2022 04:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. నెల రోజుల క్రితం వీటిపై నోటిఫికేషన్‌ వెలువరించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అభ్యంతరాలేమీ రాకపోవడంతో తాజాగా వాటి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త మండలాలు (జిల్లాల వారీగా): ఎండపల్లి, భీమారం (జగిత్యాల), నిజాంపేట్‌ (సంగారెడ్డి), గట్టుప్పల్‌ (నల్గొండ), సీరోలు, ఇనుగుర్తి (మహబూబాబాద్‌), అక్బర్‌పేట్‌-భూంపల్లి, కుకునూరుపల్లి (సిద్దిపేట), డోంగ్లి (కామారెడ్డి), కౌకుంట్ల (మహబూబ్‌నగర్‌), ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూరా (నిజామాబాద్‌).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని