చిక్కటి అడవిలో.. చక్కని కొలను!

చుట్టూ చిక్కగా అలుముకున్న చెట్లు, ఎటుచూసినా పచ్చదనంతో నిండిన కొండలు.. వాటి నడుమ ఎత్తయిన ఓ కొండపై ఈతకొలను. ఇలాంటి అద్భుత వాతావరణాన్ని ఆస్వాదించాలని, కొలనులో హాయిగా సేదతీరాలని ఎవరికి మాత్రం

Published : 27 Sep 2022 04:53 IST

చుట్టూ చిక్కగా అలుముకున్న చెట్లు, ఎటుచూసినా పచ్చదనంతో నిండిన కొండలు.. వాటి నడుమ ఎత్తయిన ఓ కొండపై ఈతకొలను. ఇలాంటి అద్భుత వాతావరణాన్ని ఆస్వాదించాలని, కొలనులో హాయిగా సేదతీరాలని ఎవరికి మాత్రం ఉండదు? అలా తలపోసేవారికి ఇక్కడ లభించే వసతి ఎంతో సౌకర్యవంతం. నాలుగువేల ఎకరాల్లో విస్తరించిన వికారాబాద్‌ అటవీ ప్రాంతంలో, పర్యాటక కేంద్రానికి 400 ఎకరాలు కేటాయించారు. సముద్ర మట్టానికి 756 అడుగుల ఎత్తున, ఓ కొండపై ఈత కోసం ప్రత్యేకంగా కొలను ఏర్పాటుచేశారు. వారాంతాల్లో పలు రాష్ట్రాల పర్యాటకులతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. 

- ఈనాడు, వికారాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని