సింగరేణి ఒప్పంద కార్మికుల డిమాండ్లపై చర్చలు సఫలం

సింగరేణివ్యాప్తంగా ఒప్పంద కార్మికులు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ఐకాస నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం

Published : 27 Sep 2022 04:53 IST

కొత్తగూడెం, సింగరేణి, గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణివ్యాప్తంగా ఒప్పంద కార్మికులు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ఐకాస నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం యాజమాన్య ప్రతినిధులతో వారు చర్చలు జరిపారు. వేతనపెంపును వేగంగా అమలు చేస్తామని సింగరేణి ప్రతినిధులు అంగీకరించారు. మొత్తం 16కి గాను 12 డిమాండ్లపై సానుకూలత తెలపడంతో 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు పరిష్కారం లభించింది. మరో మూడు విప్లవసంఘాలు మాత్రం సమ్మె విరమణను వ్యతిరేకించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని