కొండా లక్ష్మణ్‌ బాపూజీ అందరికీ ఆదర్శం : కేసీఆర్‌

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని సీఎం కేసీఆర్‌ కీర్తించారు. బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన

Published : 27 Sep 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని సీఎం కేసీఆర్‌ కీర్తించారు. బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, జీవితాంతం పోరాడిన ఆయన రాష్ట్రం గర్వించే గొప్ప నేత అని కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ జయంతి (సెప్టెంబరు 27) సందర్భంగా ఆయనకు సీఎం ఘనంగా నివాళులర్పించారు. ‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ ‘తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే, చిట్యాల(చాకలి) ఐలమ్మ సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారు. బాపూజీ స్ఫూర్తి, మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉంది. ఆయన జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుపెట్టి గౌరవించుకున్నాం’’ అని సీఎం తమ సందేశంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని