దిల్లీకి పౌర సరఫరాల అధికారుల బృందం

ఉప్పుడు బియ్యం అదనపు కోటా కోసం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారుల బృందం సోమవారం రాత్రి దిల్లీ వెళ్లింది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి మరో 15 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కేంద్ర ఆహార

Published : 27 Sep 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉప్పుడు బియ్యం అదనపు కోటా కోసం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారుల బృందం సోమవారం రాత్రి దిల్లీ వెళ్లింది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి మరో 15 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖను కోరనుంది. ఉప్పుడు బియ్యం నిల్వలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ యాసంగిలో సాధారణ బియ్యమే ఇవ్వాలని కేంద్రం కోరింది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సుమారు 35 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇప్పటికే 14.05 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. మరో 15 లక్షల టన్నులు కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వినతిపత్రం ఇచ్చింది. త్వరలో వానాకాల ధాన్యం రానున్న నేపథ్యంలో కేంద్రం మరింత మొత్తంలో ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు అనుమతిస్తే ఈ ధాన్యం మిల్లింగ్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచనలో అధికారులున్నారు. ఈ విజ్ఞప్తికి కేంద్రం అనుమతిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని