ఐలమ్మ పోరాటం ఎందరికో స్ఫూర్తి: గవర్నర్‌ తమిళిసై

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, జమీందార్ల దౌర్జన్యాలకు నిరసనగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. సోమవారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దిగువన నిర్వహించిన ఐలమ్మ

Published : 27 Sep 2022 04:53 IST

కవాడిగూడ, న్యూస్‌టుడే: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, జమీందార్ల దౌర్జన్యాలకు నిరసనగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. సోమవారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దిగువన నిర్వహించిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఐలమ్మ నుంచి స్ఫూర్తి పొందినవారు సాగించిన సాయుధ పోరాటం నిరంకుశ నిజాం పాలనను పెకిలించి వేసిందన్నారు. రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తానన్న హామీని సీఎం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ రచనశ్రీ, రజక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ నర్సింహ, జూపల్లి రాజశేఖర్‌, చంద్రమోహన్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలి: సంజయ్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తెరాస అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం కరీంనగర్‌లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే మాట తప్పారని సంజయ్‌ విమర్శించారు.

ధీర వనిత ఐలమ్మ: రేవంత్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని