పదోన్నతుల జాబితాలో 200 మంది తహసీల్దార్లు!

డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించేందుకు అనుగుణంగా నిబంధనల మేరకు సీనియారిటీ, ఇతర వివరాల సమాచారంతో తహసీల్దార్ల జాబితాను పంపించాల్సిందిగా ప్రభుత్వం

Published : 27 Sep 2022 04:53 IST

ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమవుతున్న దస్త్రం

ఈనాడు, హైదరాబాద్‌: డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించేందుకు అనుగుణంగా నిబంధనల మేరకు సీనియారిటీ, ఇతర వివరాల సమాచారంతో తహసీల్దార్ల జాబితాను పంపించాల్సిందిగా ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈమేరకు 200 మంది తహసీల్దార్ల జాబితాతో కూడిన దస్త్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సీనియారిటీ ఉన్న తహసీల్దార్లు కొన్నేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం ‘స్పెషల్‌ గ్రేడ్‌’గా పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈమేరకు అప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి 80 నుంచి 110 వరకు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని అంచనా. మరికొందరు కూడా పదవీ విరమణ పొందడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తహసీల్దార్లలో నిబంధనల మేరకు అర్హులను గుర్తించి జాబితాను రూపొందిస్తున్నారు. వివరాలను మంగళవారం నాటికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించినట్లు తెలిసింది.

అనర్హులపై ఆరా?: రెండు రోజుల క్రితం 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. వీరిలో ముగ్గురు లేదా నలుగురికి సంబంధిత అర్హతలు లేనట్లుగా చర్చ జరుగుతోంది. ఏసీబీ కేసులు, సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన అనర్హతలు ఉన్నప్పటికీ వారికి పదోన్నతులు ఎలా ఇచ్చారనే కోణంలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని