ఆన్‌లైన్‌లోకి మరిన్ని సేవలు: మంత్రి పువ్వాడ

మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. రవాణాశాఖ

Published : 27 Sep 2022 04:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. విద్యుత్తు బస్సుల పనితీరు, ఆదాయ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘ఆన్‌లైన్‌ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో పాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గింది. మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తే వారికి సౌలభ్యంగా ఉంటుంది. దసరా రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయటంతోపాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’’ అని మంత్రి స్పష్టంచేశారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు ఆర్టీసీ, రవాణాశాఖల అధికారులు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని