కాణిపాకం వరసిద్ధుడి దర్శనానికి మూడంచెల క్యూలైన్‌

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మూడంచెల క్యూలైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పాలకమండలి ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. సోమవారం పాలకమండలి సమావేశంలో

Published : 27 Sep 2022 05:53 IST

 త్వరలో బ్రేక్‌ దర్శనం అమలు

కాణిపాకం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మూడంచెల క్యూలైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పాలకమండలి ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. సోమవారం పాలకమండలి సమావేశంలో వారు మాట్లాడారు. తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు నిరంతర దర్శనం కొనసాగించేలా క్యూలైన్ల వ్యవస్థను మార్పు చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆలయంలో ఆరు గంటల పాటు దర్శనాన్ని నిలిపివేయాల్సి వస్తోందని, దీన్ని అధిగమించడానికి అభిషేకం సమయంలో భక్తుల దర్శనం కొనసాగించేందుకు వీలుగా క్యూలైన్ల నిర్మాణానికి తీర్మానం చేశామని చెప్పారు. త్వరలో బ్రేక్‌ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని