మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ

దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ అవార్డు సాధించింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేతులమీదుగా

Published : 28 Sep 2022 03:13 IST

అవార్డు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పర్యాటక మిత్ర రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌

అపోలో ఆస్పత్రికి కూడా..

ఈనాడు, దిల్లీ: దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ అవార్డు సాధించింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేతులమీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అవార్డును అందుకున్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలకు 2018-19 సంవత్సరానికి సంబంధించిన అవార్డులు అందజేశారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా అవార్డుల ప్రదానోత్సవం నిలిచిపోయింది.  పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తరాఖండ్‌ ప్రథమ స్థానం పొందగా.. మహారాష్ట్ర ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఉత్తమ పర్యాటక మిత్ర రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. ఈ అవార్డును కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అజయ్‌భట్‌ల చేతులమీదుగా సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ ఎ.కె.గుప్తా, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ జోగేష్‌ కుమార్‌ అందుకున్నారు. అట్లాగే.. ఉత్తమ పర్యాటక మిత్ర గోల్ఫ్‌ కోర్సుగా హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సు, ఉత్తమ వైద్య పర్యాటక వసతుల కేంద్రంగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రి నిలిచి అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అజయ్‌భట్‌లు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు.

పనితీరు కనబరిచే రాష్ట్రంపై కక్ష సాధింపా..?

కేంద్రం వివిధ, విభాగాల్లో అందిస్తున్న అవార్డుల్లో తెలంగాణ ప్రథమ స్థానం సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోందని రాష్ట్రం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రంగాల్లో అద్భుత పనితీరు కనబర్చుతున్న తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని