పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) కన్వీనర్‌ ప్రొ.ఐ.పాండురంగారెడ్డి మంగళవారం విడుదల

Published : 28 Sep 2022 04:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) కన్వీనర్‌ ప్రొ.ఐ.పాండురంగారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది 57,262 మంది సీపీగెట్‌ రాయగా.. కౌన్సెలింగ్‌కు 54,050 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల(సర్టిఫికెట్ల) పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ముగిశాక.. అక్టోబరు 18న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు.  మరిన్ని వివరాలకు www.ouadmissions.com ,www.osmania.ac.in, cpget.tsche.ac.in  లను సందర్శించాలని పాండురంగారెడ్డి సూచించారు.

కౌన్సెలింగ్‌ టైంటేబుల్‌ ఇలా..

ఈ నెల 28 నుంచి అక్టోబరు 10 వరకు: ధ్రువపత్రాల ఆన్‌లైన్‌ పరిశీలన, రిజిస్ట్రేషన్‌

అక్టోబరు 11: తప్పుల సవరణకు అవకాశం

అక్టోబరు 12- 15: వెబ్‌ ఆప్షన్ల నమోదు

అక్టోబరు 16: వెబ్‌ ఆప్షన్లలో సవరణలకు అవకాశం

అక్టోబరు 18: మొదటి విడత సీట్ల కేటాయింపు

అక్టోబరు 21 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి

అక్టోబరు 24: రెండో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని