చదువుల తల్లికి చేయూత

జేఈఈ మెయిన్స్‌లో జాతీయ ర్యాంకు(340) సాధించిన దివ్యాంగురాలు చైతన్య చదువుకు ఆర్థిక పరిస్థితులు సహకరించని తీరుపై ‘చదువుల తల్లి సాయం కోరుతోంది’ శీర్షికన ఈనెల 26న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి

Updated : 28 Sep 2022 05:08 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: జేఈఈ మెయిన్స్‌లో జాతీయ ర్యాంకు(340) సాధించిన దివ్యాంగురాలు చైతన్య చదువుకు ఆర్థిక పరిస్థితులు సహకరించని తీరుపై ‘చదువుల తల్లి సాయం కోరుతోంది’ శీర్షికన ఈనెల 26న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. తమకు తోచినంత సాయంచేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. బీడీఎల్‌కు చెందిన వ్యాపారి కల్లెం శ్రీనివాస్‌రెడ్డి చైతన్య ఇంటికి వెళ్లి ఫీజు కోసం రూ.35వేల చెక్కు అందించారు. చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌ రూ.35 వేలు ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు ద్వారా చైతన్య తండ్రి మహిపాల్‌ కాలు శస్త్రచికిత్సకు అవసరమైన సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన గణేశ్‌ రూ.20వేలు, హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన లారస్‌ పాఠశాల డైరెక్టర్‌ డా.గోపాలకృష్ణ రూ.15వేలు ఫోన్‌పే ద్వారా అందించారు. సంగారెడ్డికి చెందిన వైద్యులు డా.శ్రీకాంత్‌ రూ.10వేలు అందజేశారు. బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు అరికపూడి రఘు ప్రవాస భారతీయులు లక్ష్మీనర్సింహం సహకారంతో చైతన్య తల్లి మంజులకు కుట్టు మిషన్‌తో పాటు రూ.1.30 లక్షలు స్వయం ఉపాధికి అందించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ పంజాగుట్టకు చెందిన రుక్మిణీ గోవిందరావు ట్రస్టు ద్వారా ప్రతి ఏటా కళాశాల, వసతిగృహానికయ్యే ఫీజును చైతన్యకు తాము చెల్లిస్తామని, దుస్తులు, పుస్తకాల ఖర్చును కూడా ఇస్తామని ట్రస్టు ఛైర్మన్‌ దామోదర్‌రావు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts