అక్టోబరు 10 నుంచి హైకోర్టులో విచారణ ప్రత్యక్ష ప్రసారం

తెలంగాణ హైకోర్టు సాంకేతికంగా మరో ముందడుగు వేయనుంది. అక్టోబరు 10 నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మొదటి కోర్టు హాలులో

Updated : 28 Sep 2022 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సాంకేతికంగా మరో ముందడుగు వేయనుంది. అక్టోబరు 10 నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మొదటి కోర్టు హాలులో చేపట్టే విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. సంబంధిత వెబ్‌లింక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది.

29 నుంచి దసరా సెలవులు

హైకోర్టుకు ఈ నెల 29 నుంచి అక్టోబరు7 వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 30న పిటిషన్‌లను దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. వీటిపై అక్టోబరు 6న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ సీహెచ్‌.సుమలతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

1951-58 కేసులకు ప్రత్యేక ధర్మాసనం

1951-1958ల మధ్య ఉన్న సివిల్‌ సూట్‌లకు సంబంధించిన పిటిషన్‌లపై విచారణ నిమిత్తం దసరా సెలవుల తరువాత ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు