మొదటి అటవీ వర్సిటీగా ములుగు కళాశాల

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) దేశంలో మొదటి అటవీ విశ్వవిద్యాలయంగా మారనుంది. అసెంబ్లీ ఇటీవలి సమావేశాల్లో దీనికి ఆమోదం తెలపడంతో అవసరమైన మౌలిక సదుపాయాల

Published : 28 Sep 2022 04:02 IST

రష్యా, చైనా తర్వాత ఇక్కడే..

ఈనాడు, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) దేశంలో మొదటి అటవీ విశ్వవిద్యాలయంగా మారనుంది. అసెంబ్లీ ఇటీవలి సమావేశాల్లో దీనికి ఆమోదం తెలపడంతో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పాలన, నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అటవీ విద్యలో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులు ఉన్నాయి. అటవీ కళాశాల యూనివర్సిటీగా మారడంతో అదనంగా పీహెచ్‌డీ కోర్సు, నర్సరీ మేనేజ్‌మెంట్‌, ఆగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, క్లైమెట్‌ స్మార్ట్‌ ఫారెస్ట్రీ, పట్టణ అటవీవనాలు, ఫారెస్ట్‌ పార్క్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్ల్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని