భారతీయ సినీపరిశ్రమకు తెలంగాణ ముద్ర జైరాజ్‌

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్‌ బిడ్డ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీర్తించారు. సెప్టెంబరు

Updated : 28 Sep 2022 05:02 IST

  రాష్ట్ర కీర్తిని దేశమంతటా చాటారు

నేడు జైరాజ్‌ జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళి

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్‌ బిడ్డ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీర్తించారు. సెప్టెంబరు 28న జైరాజ్‌ జయంతి సందర్భంగా సీఎం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జాతీయ చలనచిత్ర పరిశ్రమకు జైరాజ్‌ సేవలను స్మరించుకున్నారు. ‘‘భారతీయ సినిమా తొలిదశలో ప్రారంభమైన మూకీల నుంచి టాకీల వరకు సాగిన జైరాజ్‌ ప్రస్థానం చిరస్మరణీయం. భారతీయ వెండి తెరపై మొట్టమొదటి యాక్షన్‌ హీరో ఆయనే కావడం తెలంగాణకు గర్వకారణం. బాలీవుడ్‌లో తన నటనాకౌశలంతో పాటు, దర్శకునిగా, నిర్మాతగా రాణించి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం తదితర భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించారు. తెలంగాణ నుంచి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన గొప్పవారిలో ఆయన ఒకరు. జైరాజ్‌ సేవలకు గుర్తుగా రవీంద్రభారతిలోని సమావేశ మందిరానికి ‘పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌’గా పేరుపెట్టి గౌరవించుకున్నాం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాంస్కృతిక శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ యువత సినీ పరిశ్రమలోని పలు విభాగాల్లో గొప్పగా రాణిస్తోంది. భవిష్యత్తులో తెలంగాణ సినిమా రంగం మరింతగా పురోగమించాలి’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని