దిల్లీలో వేడుకలతో తెలంగాణ సంస్కృతికి గుర్తింపు: కిషన్‌రెడ్డి

మన ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని, దిల్లీ గడ్డపై కర్తవ్యపథ్‌ వేదికగా జరిగిన బతుకమ్మ సంబరాలతో తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు దక్కిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విమోచన

Published : 28 Sep 2022 04:02 IST

ఈనాడు, దిల్లీ: మన ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని, దిల్లీ గడ్డపై కర్తవ్యపథ్‌ వేదికగా జరిగిన బతుకమ్మ సంబరాలతో తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు దక్కిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాల్లో భాగంగా దిల్లీలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దిల్లీ ఇండియాగేట్‌ సమీపంలోని కర్తవ్యపథ్‌లో మంగళవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నం నుంచే బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. వారితో కలిసి.. కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి, కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, సినీనటి జీవిత తదితరులు బతుకమ్మ ఆడారు. వేడుకల్లో కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్‌, జితేంద్రసింగ్‌, అజయ్‌ భట్‌, అన్నపూర్ణాదేవి, పలువురు కేంద్రమంత్రుల సతీమణులు, వివిధ శాఖల అధికారిణులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts