డ్రోన్లతో ఔషధాల సరఫరాలో తెలంగాణ ఘనత: కేటీఆర్‌

ఆకాశమార్గాన ఔషధాల పంపిణీలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. సానుకూల సామాజిక ప్రభావం

Published : 28 Sep 2022 04:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆకాశమార్గాన ఔషధాల పంపిణీలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. సానుకూల సామాజిక ప్రభావం చూపితేనే సాంకేతికతకు సార్థకత చేకూరుతుందనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం మేరకే డ్రోన్ల ద్వారా ఔషధాలను మారుమూల ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు డ్రోన్ల ద్వారా ఔషధాలను తరలించడంపై ఆయన స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.

గోల్కొండ ఎల్లమ్మ దీవెనలు

సిరిసిల్ల జిల్లాలోని రగుడు గ్రామానికి చెందిన గోల్కొండ ఎల్లమ్మ తెరాసకు ప్రత్యేకాభిమాని అని, 2010 శాసనసభ ఉప ఎన్నికల్లో తన ప్రచార వాహనం వద్దకు వచ్చి మొదటిసారిగా రూ. 100 విరాళం ఇచ్చి ఆశీర్వదించారని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఆమెను ఈ రోజు కలిశానని, ఇప్పుడూ అదే అభిమానంతో తనను ఆశీర్వదించారని తెలిపారు. ఆమెతో ఉన్న ఫొటోను జతచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని