బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బదిలీలు చేపట్టాలో..

రాష్ట్రవ్యాప్తంగా మిగతా 13 జిల్లాల్లోనూ ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర స్పౌజ్‌ ఫోరం బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ఆడిటోరియం ఎదుట వారు ఆవేదన సభ

Published : 28 Sep 2022 04:02 IST

రాష్ట్రవ్యాప్తంగా మిగతా 13 జిల్లాల్లోనూ ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర స్పౌజ్‌ ఫోరం బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ఆడిటోరియం ఎదుట వారు ఆవేదన సభ నిర్వహించారు. ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి పిల్లలతోపాటు ఉపాధ్యాయ దంపతులు కార్యక్రమానికి తరలివచ్చారు. బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మాట నిలబెట్టుకోవాలని కోరారు. వీరంతా మొదట జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆడిటోరియం వరకు బతుకమ్మలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీ, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్పౌజ్‌ ఫోరం ప్రతినిధులు వివేక్‌, ఖాదర్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, నరేష్‌, కృష్ణ, సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

      - న్యూస్‌టుడే, ఎన్జీవోస్‌కాలనీ(హనుమకొండ)

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts