పల్లె ఒకటుంది.. ఠాణా మెట్లెక్కదండి

40 ఏళ్లుగా ఒక్క కేసు కూడా లేని ఆదర్శపల్లె ర్యాగట్లపల్లి. ఠాణా మెట్లెక్కని ఊరిది. కామారెడ్డి- మెదక్‌ జిల్లాల సరిహద్దులోని భిక్కనూరు మండలంలో

Published : 29 Sep 2022 04:34 IST

ఆదర్శంగా నిలుస్తున్న ర్యాగట్లపల్లి వాసులు

కేసుల్లేని గ్రామంగా ధ్రువీకరించిన జిల్లా న్యాయమూర్తి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, భిక్కనూరు:  40 ఏళ్లుగా ఒక్క కేసు కూడా లేని ఆదర్శపల్లె ర్యాగట్లపల్లి. ఠాణా మెట్లెక్కని ఊరిది. కామారెడ్డి- మెదక్‌ జిల్లాల సరిహద్దులోని భిక్కనూరు మండలంలో ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి లిటిగేషన్‌ ఫ్రీ విలేజ్‌(కేసులు లేని గ్రామం)గా ప్రకటించారు. పాలకవర్గ ప్రతినిధులకు మంగళవారం ధ్రువీకరణపత్రం అందించారు. 930 మంది జనాభా.. 180 కుటుంబాలున్న ర్యాగట్లపల్లిలో ఐక్యత పరిఢవిల్లుతోంది. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల సభ్యులున్నప్పటికీ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు నెరుపుతూ తరువాత గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతున్నారు. మద్యపానంతో గొడవలకు ఆస్కారం ఉందనే ఉద్దేశంతో 12 ఏళ్లుగా గ్రామంలోని గొలుసు దుకాణాన్ని బంద్‌ చేయించారు. ఎవరైనా విక్రయిస్తే రూ.5 వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించే పంచాయితీనే వారికి పోలీసు ఠాణా. ఎవరి మధ్య గొడవ జరిగినా గ్రామస్థుల సమక్షంలో చర్చించుకుంటారు. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు 63 మందితో ఉన్న తాతల సంఘం విశేషంగా కృషి చేస్తోంది. సమస్యలుంటే ఈ సంఘం ఇంటింటికీ వెళ్లి సర్దిచెబుతోంది. ఇక్కడి వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని భిక్కనూర్‌ ఎస్సై ఆనంద్‌గౌడ్‌ చెబుతున్నారు.


అందరి సమక్షంలో పరిష్కారం: గ్రామపెద్దలు

సమస్యలను గ్రామస్థుల సమక్షంలో చర్చించి ఇరువర్గాలకు ఆమోదయోగ్య పరిష్కారం కనుగొంటాం. కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లడం లేదు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసిన వారిని చూడలేదు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి ఉండాలని యువతను కోరుతున్నాం.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని