రేపటి నుంచి కరీంనగర్‌లో కళోత్సవాలు

తెలంగాణ కళావైభవాన్ని కళ్లకు కట్టేలా కరీంనగర్‌లో మూడ్రోజుల పాటు కళోత్సవాలు నిర్వహిస్తున్నామని.. శుక్రవారం నుంచి ప్రారంభమయే ఈ వేడుకలకు మూడు దేశాలతో పాటు 20

Updated : 29 Sep 2022 06:11 IST

20 రాష్ట్రాల నుంచి కళాకారుల రాక

మంత్రి గంగుల వెల్లడి

ఈనాడు, కరీంనగర్‌: తెలంగాణ కళావైభవాన్ని కళ్లకు కట్టేలా కరీంనగర్‌లో మూడ్రోజుల పాటు కళోత్సవాలు నిర్వహిస్తున్నామని.. శుక్రవారం నుంచి ప్రారంభమయే ఈ వేడుకలకు మూడు దేశాలతో పాటు 20 రాష్ట్రాలకు చెందిన 500 మంది కళాకారులు హాజరవుతున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..150 కళాప్రదర్శనలకు కరీంనగర్‌ వేదిక కానుందన్నారు. 30వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రమంత్రి కేటీఆర్‌ రానున్నారని మంత్రి తెలిపారు. సినీ నటులతో పాటు పేరొందిన గాయకులు, కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. అక్టోబరు2న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగే ఈ కళోత్సవాల్లో జాతీయ స్థాయిలో పేరొందిన కళాప్రదర్శనలుంటాయన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని