కేంద్రాన్ని నమ్మిన వారికి ఇబ్బందులే..

కేంద్రాన్ని నమ్మిన వారికి ఇబ్బందులు తప్పడం లేదని.. రాష్ట్రమే నేతన్నలకు ఆత్మబంధువుగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మాజీ

Published : 29 Sep 2022 04:34 IST

రాష్ట్రమే నేతన్నలకు ఆత్మబంధువు: మంత్రి హరీశ్‌రావు

బాధ్యతలు స్వీకరించిన చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రాన్ని నమ్మిన వారికి ఇబ్బందులు తప్పడం లేదని.. రాష్ట్రమే నేతన్నలకు ఆత్మబంధువుగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ బుధవారం హైదరాబాద్‌ టెస్కో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. రూ.350 కోట్ల నిధులతో బతుకమ్మ చీరల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధికల్పిస్తున్నాం. మరోవైపు నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అఖిలభారత చేనేత, జౌళి అభివృద్ధి సంస్థలను రద్దు చేసింది. పొదుపు నిధి పథకానికి తిలోదకాలిచ్చింది. చేనేతపై జీఎస్టీ విధించి నేతన్నలపై పెనుభారం మోపింది. రోజూ తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులు గొప్పలు చెబుతున్నారు. రాష్ట్రానికి పైసా సాయం చేయరు. వరంగల్‌ జౌళి పార్కుకు రూపాయి ఇవ్వలేదు’’ అని తెలిపారు. చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని