3 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 3.1

Published : 29 Sep 2022 04:34 IST

పిడుగుపాటుకు నలుగురి మృతి

ఈనాడు,హైదరాబాద్‌-న్యూస్‌టుడే బృందం: బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు తెలంగాణతో పాటు, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. తెలంగాణలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కెరమెరి(కుమురం భీం జిల్లా)లో 10.4 సెంటీమీటర్లు, హన్వాడా(మహబూబ్‌నగర్‌)లో 6.6, జైన(జగిత్యాల)లో 5.6, మల్కారం(భద్రాద్రి)లో 5.3, ఘన్‌పూర్‌(మేడ్చల్‌)లో 5.2, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పెద్దఅంబర్‌పేటలో 5.1, హయత్‌నగర్‌లో 4.7, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షానికి హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పిడుగులు పడి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండతండాలో పశువులు కాసేందుకు వెళ్లిన నేనావత్‌ నాన్కు (55), రుక్మిణి (30)తోపాటు మరో ముగ్గురిపై పిడుగుపడింది. దీంతో నాన్కు, రుక్మిణి మృతిచెందగా.. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారంలో పొలం నుంచి ఇంటికి వెళ్తున్న కొమ్ము సత్తన్న(33)పై పిడుగుపడటంతో మృత్యువాతపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మేకలు మేపుతున్న వీరబోయిన నాగయ్య(30)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని