కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ల టెండర్లు కొనసాగించొచ్చు

రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయడానికి జారీ చేసిన టెండర్లను ఖరారు చేసుకోవచ్చంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు

Updated : 29 Sep 2022 04:38 IST

అనుమతించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయడానికి జారీ చేసిన టెండర్లను ఖరారు చేసుకోవచ్చంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు అనుమతించింది. దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉందన్న ప్రభుత్వ వాదన నేపథ్యంలో చట్టబద్ధత అంశాన్ని తరువాత తేలుస్తామని, ప్రస్తుతం టెండర్ల ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొంది. న్యూట్రిషన్‌ కిట్‌ల సరఫరా నిమిత్తం ఆగస్టు 13న జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన లాన్‌ ఇ-గవర్నెన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ అసలు టెండరే వేయలేదన్నారు. టెండరు ప్రక్రియలో పాల్గొనకుండానే ఇక్కడ పిటిషన్‌ వేయడం సరికాదన్నారు. టెండర్‌ను కొనసాగించడం వల్ల పిటిషనర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హిందూస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌కు అనుకూలంగా అధికారులు టెండరు నిబంధనలను రూపొందించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి టెండర్ల ప్రక్రియను కొనసాగించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని