అమెరికాలో వెలిగిన తెలుగుతేజం విధాత్రి

అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్‌ స్టూడెంట్‌ పోయెట్ రాయబారిగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన కీత

Published : 29 Sep 2022 04:34 IST

గరిడేపల్లి, న్యూస్‌టుడే: అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్‌ స్టూడెంట్‌ పోయెట్ రాయబారిగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన కీత విధాత్రి ఎంపికయ్యారు. 50 రాష్ట్రాల నుంచి అయిదు లక్షల మంది పోటీల్లో పాల్గొన్నారు. వివిధ దశల్లో జరిగిన పరీక్షల్లో విజయం సాధించిన అయిదుగురిని చివరి దశకు ఎంపిక చేశారు. ఈ రౌండ్‌లో ప్రతిభ కనబరిచి విధాత్రిని యంగ్‌ పోయెట్ రాయబారిగా నియమించారు. వైట్హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ విధాత్రికి మెడల్‌ బహూకరించారు. 5,000 డాలర్ల పారితోషికం ఇచ్చి సత్కరించారు. కీతవారిగూడేనికి చెందిన నాగేశ్వరరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగ రీత్యా 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్లారు. ఆయన కుమార్తే విధాత్రి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని