జస్టిస్‌ శ్రీదేవికి ఘనంగా హైకోర్టు వీడ్కోలు

తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ గండికోట శ్రీదేవికి బుధవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది.

Published : 29 Sep 2022 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ గండికోట శ్రీదేవికి బుధవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్టోబరు 9న ఆమె పదవీ విరమణ చేయనుండగా.. దసరా సెలవుల నేపథ్యంలో బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు మొదటి కోర్టు హాలులో సమావేశమై న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్రీదేవి అందించిన సేవలను కొనియాడారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ శ్రీదేవి 14 వేలకుపైగా ప్రధాన కేసులు, 6 వేలకుపైగా అనుబంధ కేసులను పరిష్కరించారని అన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ శ్రీదేవి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించారని వివరించారు. తన విధి నిర్వహణలో సహకరించిన వారికి జస్టిస్‌ శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి దంపతులు జస్టిస్‌ శ్రీదేవికి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌ నేతృత్వంలో బార్‌ అసోసియేషన్‌ ఆమెను ఘనంగా సన్మానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు